Telugu Boothu Kathalu – ఫ్యామిలీ పదనిసలు

Telugu Boothu Kathalu – ఫ్యామిలీ పదనిసలు

Telugu Boothu Kathalu అదొక పల్లెటూరు.  రచ్చబండ దగ్గర రాత్రి పదిగంటల వరకు బాతాఖానీ వేసి లేచారు గ్రామపెద్దలంతా. అప్పటివరకు కరెంటు కష్టాల గురించీ, జగన్ ఓదార్పు యాత్రల గురించీ చర్చించి, రాబోవు ఉప ఎన్నికల గురించి, కబుర్లు చెప్పుకుని అలసిపోయి నిద్ర ముంచుకురావడంతో ఇళ్లకు బయలుదేరారు.

తుండు తీసి దులిపి భుజాన వేసుకుని తన ఇంటివైపు నడిచాడు గిరినాయుడు.

చీకటి పడగానే అన్నం తిని రావిచెట్టు కింద రచ్చబండ మీదకి చేరడం ఆఊరి పెద్దలకలవాటు.

Telugu Boothu Kathalu

Telugu Boothu Kathalu

కుర్రకారు కూడా వీధి చివర తూము మీదనో, శివాలయం మెట్లమీదనో, మాజీ మునసబు ఇంటి అరుగు మీదనో చేరి సినిమాకబుర్లతో కాలక్షేపం చేసేవారు. కానీ, కేబుల్ టీవీలు వచ్చాక సినిమాలకోసం, క్రికెట్ మ్యాచ్ ల కోసం టీవీ కి అతుక్కుపోతున్నారు ఇప్పుడు.

గిరినాయుడు కూడలిలోకి వచ్చి తన ఇల్లు ఉన్న వీధిలోకి మలుపు తిరుగుతూ హఠాత్తుగా ఆగిపోయాడు. అప్పటికి గంటక్రితమే కరెంటు పోయింది. అయినా పౌర్ణమి పోయి రెండు రోజులే కావడంతో వెన్నెల పుచ్చపువ్వులా విరిసి ఉంది. ఆ వెన్నెల వెలుగులో తన ఇంటిప్రహారీగోడ దాటుతున్న ఆకారాన్ని చూసి ఆగిపోయాడు గిరినాయుడు. దూరంగా ఉండడంవల్ల మొహం గుర్తు తెలియలేదు. బలంగా ఉన్న యువకుడని మాత్రం తెలిసింది గిరినాయుడుకి. రెండు చేతులతో ప్రహరీ అంచుపట్టుకుని ఒక్క వూపున పైకి లేచి గోడ మీదికి చేరింది ఆ ఆకారం..ఒక్కసారి వీధిలోకి అటూఇటూ చూసి లోపలికి దూకింది.ఆ ఆకారం తను వున్న వైపు చూసేప్పటికి కనిపించకుండా అడుగు వెనక్కి వేసి గోడమూల నక్కాడు గిరినాయుడు. తిరిగి చూసేసరికి ఆ ఆకారం అటువైపుకి దూకేసింది.

“ఎవడు వాడు? దొంగా?” అనుకున్నాడు గిరినాయుడు. ఒక్కడు ఆ విధంగా దొంగతనానికి రాడు.వచ్చినా ఏమీ దొరకదు..పచ్చగడ్డి మోపు, వరిగడ్డి కట్టా ఎట్టుకెళ్లాలి .దానికోసం ఆ సమయంలో ఎవడూ దొంగతనానికి రాడు. పైగా లుంగీ, బనియన్ తో ఉన్నాడు ఆ వ్యక్తి.

Top