Telugu Sex Stories – అతి సర్వత్ర వర్జయేత్

Telugu Sex Stories – అతి సర్వత్ర వర్జయేత్

Telugu Sex Stories అప్పుడే స్నానం చేసి వంటికి టవల్ చుట్టుకుని బాత్రూం లో నుంచి బెడ్రూం లోకి వచ్చింది శ్రావణి.ఆమె బాడీ నుంచి మైసూర్ శాండల్ పరిమళాలు రూం నిండా వ్యాపిస్తున్నాయి. ఆ టవల్ ఆమె అందాల్ని దాచలేకపోతుంది. శ్రావణి చాలా మంచి అందగత్తె. ఆమె శరీరంలోని ప్రతీ అవయవమూ బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఆమె కళ్లు…కళ్లేంటి, చివర “ళ్లు” అని వచ్చే ప్రతి అవయవమూ ఆమెలో స్పెషల్. అందుకే ఆమె భర్త సుబ్రమణ్యం ఆమెని ఏరికోరి మరీ పెళ్లి చేసుకున్నాడు.. కాణీ కట్నం లేకుండా. ఇద్దరూ మంచి ఈడూ జోడూ.ఆమె టవల్ పక్కనేసి బట్టలు కట్టుకోసాగింది. ఇంతలో మోటర్ సైకిల్ శబ్దం వినిపించింది. భర్త ఆఫీసు నుంచి వచ్చినట్లున్నాడు అనుకుంటూ డ్రస్సింగ్ టేబుల్ దగ్గరకెళ్లి పౌడర్ పూసుకుని బొట్టు పెట్టుకుంటూండగానే సుబ్రమణ్యం లోపలికొచ్చేసాడు. “తెచ్చారా?” అనడిగింది శ్రావణి లోపలికొచ్చిన భర్తని చూడగానే.

Telugu Sex Stories

Telugu Sex Stories

“లేకపోతే నువ్వు ఊరుకుంటావా?”అన్నాడు సుబ్రమణ్యం నవ్వుతూ.

“ఏదీ చూపించండి”అంటూ శ్రావణి అతడి దగ్గరకెళ్లి చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ని లాక్కుంది.

ఆమె బ్యాగ్ తెరుస్తుండగా సుబ్రమణ్యం ఆమె వెనుకగా నిలబడి భుజం మీదుగా ఆమె చెంపల్ని వాసన చూస్తూ చేతులు పొట్టచుట్టూ బిగించేసి..”బీర్ కాదు బ్రాందీ తెచ్చానీసారి. ఇప్పుడు రేట్లు కూడా తగ్గాయి .యం.ఆర్.పి. రేట్లకే
ఇస్తున్నారు” అన్నాడు.

“అవునా.ఈ మధ్య రోజూ పేపర్లో ఇవే వార్తలు కదా.”అంటూ బ్యాగ్ లో చెయ్యిపెట్టి సీసాని బయటికితీసి చూసింది శ్రావణి.

మ్యాన్షన్ హౌస్ బ్రాందీ హాఫ్ బాటిల్ అది. పచ్చగా .బంగారపురంగులో నీళ్లలా. మెరుస్తూ కనిపించింది.

సీసాని వాసనచూస్తూ చిలిపిగా దాన్ని ముద్దెట్టుకుని నవ్వుతూ భర్తని చూసింది.

“కష్టపడి తెచ్చినవాణ్ని నేను! ముద్దులన్నీ సీసాకేగాని నాకేమీలేవా?” అనడిగాడు సుబ్రమణ్యం ఆమె పొత్తికడుపుని చేతులతో తడుముతూ.

శ్రావణి అందంగా నవ్వి- “ముద్దుకన్నా మంచి తీయటి వార్త చెప్పనా మీకు?” అనడిగింది.

“ఏమిటబ్బా అంత తియ్యటి వార్త? త్వరగా చెప్పు”

“మన పక్క పోర్షన్లోకి కొత్తగా అద్దెకు వచ్చారే వేణుగోపాల్,రాధ అనే వాళ్లు””-

“వూc”

“ఆయన నా చెయ్యి పట్టుకున్నాడు పొద్దున”

“ఎప్పుడు?”

“మీరు ఆఫీసుకి వెళ్లింతర్వాత. బట్టలు ఆరవేద్దామని వెళుతుంటే పట్టుకున్నాడు” అంది శ్రావణి సీసాని బ్యాగ్ లో పెడుతూ.

సుబ్రమణ్యం గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. ఊపిరి భారంగా పీలుస్తున్నాడు.

“ఎవరూ చూడలేదుకదా?” అన్నాడు.

Top